సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా 15న సికింద్రాబాద్–విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు.( గతంలో జనవరి 19 అని ప్రకటించినప్పటికీ కాస్త ముందుగానే..) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో 8వ వందేభారత్ రైలును జనవరి 15న ఉదయం 10:00 గం టలకు ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం మధ్య కేవలం 8 గంటల్లోనడిచే ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం లో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం , విజయవాడ, రాజమండ్రిల్లో ఆగనుంది. అతి త్వరలో మరో వందేభారత్ ఎస్ ప్రెస్ రైలు తిరుపతికి సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *