సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం సీఎం జగన్ తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుండి “జగనన్న ఆరోగ్య సురక్ష‘ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వారికీ అవసరం అయిన మందుల సాయం , కంటి అద్దాల తో పాటు డాక్టర్స్ సాయం ఉచితముగా అందించనున్నాము. ప్రతి కుటుంబం అందులో సభ్యులు ఆరోగ్యంగా ఉండాలి…వాలంటర్స్ వారి పరిధిలోని ప్రతి ఇంటిలో ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మ్యాప్ చేసి ఇస్తే.. ఆ గ్రామాన్ని ప్రభుత్వ ప్యామిలీడాక్టర్ సందర్శిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి విషయంలో వారిపై మరింత శ్రద్ద తీసుకుంటాం. ఎనీమియా కేసులతో పాటు మాతాశిశు సంరక్షణ కార్యక్రమం చేపడుతాం. వారికి ఫుడ్ సప్లమెంట్ కూడా చేస్తాం. ప్రతి మండలంలోనూ పదేపదే క్యాంపులు నిర్వహిస్తాం. సెప్టెంబర్ 15 నుంచి మొదటి కేసులో వాలంటీర్లు, గృహసారధులు, ప్రజా ప్రతినిధులు వెళ్లి ప్రతి ఇంటి తలుపుతడతారు. అని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.
