సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య దూరం మరింత దగ్గరయ్యేలా ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘వందేభారత్ ఎక్ప్ ప్రెస్’ రైలుకు సంబంధించి ప్రారంభ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. . వందే భారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం , మరియు విశాఖపట్నం -సికిం ద్రాబాద్ మధ్య నడవనున్న ట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. సికింద్రాబాద్ నుండి బయలుదేరే ఈ వందేభారత్ఎక్స్ ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం , విజయవాడ, ఏలూరు , తాడేపల్లిగూడెం, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుం టుందని గరిష్ఠంగా గంటకు 180 కిమీ వేగం తో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటివరకు 5 రైళ్లు ప్రారంభమయ్యాయి. దేశంలో ఆరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ తెలుగు రాష్ట్రాల మధ్య సేవలందించనుంది. మరోవైపు తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు రూ.7000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యనున్నారు.
