సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో తమిళనాడు తరహా కక్ష సాధింపు రాజకీయాలు ఊపందుకున్నాయి. గతంలో అధికారంలో ఉన్నపుడు నువ్వొక్కటి చేస్తే నేను రెండు చేస్తా అన్న తరహాలో ఈ పరిణామాలు ఏ పరిస్థితులకు దారి తీస్తాయో ?కానీ .. ఉండవల్లిలోని బోటు యార్డ్ స్థలంలో ఇప్పటికి స్లాబ్ లు పూర్తీ చేసి నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ నేటి (శనివారం) తెల్లవారుజాము 5 గంటల ప్రోక్రేన్స్ బుల్ డోజర్స్ సాయంతో వేగంగా కూల్చివేస్తున్నారు.అక్కడ భారీ పోలీస్ బలగాలు మోహరించి పరిస్థితి ఉద్రికతం కాకుండా పర్యవేక్షిస్తున్నారు. ఉండవల్లిలోని బోట్ యార్డ్ స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం లీజుకి జగన్ సర్కార్ కట్టబెట్టింది.అప్పట్లో ఈ అంశాన్ని టీడీపీ, జనసేనలు ప్రస్తావించాయి.
