సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు నేడు, గురువారం ఉండి బస్ స్టాండ్ ప్రాంగణంలో 43.43 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను జిల్లా కలెక్టర్, సి. నాగ రాణితో కల్సి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇక నేడు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా నేటి ఉదయం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాలలో ఆలయ మర్యాదలతో పాల్గొని శ్రీస్వామివారిని దర్శించుకొన్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాలలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఇక్కడ నేడు జరిగే రధోత్సవం విశేషమైనది.
