సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని నేడు, గురువారం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పరామర్శించారు. తదుపరి, రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరం తిరుపతి అని.. ఇక్కడ వైసీపీ వారే టీడీపీ అభ్యర్థి పులపర్తి నాని ఫై దాడి చేసారని ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన ప్రదేశానికి మారణాయుధాలతో వచ్చారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు ఉందా? అని ప్రశ్నించారు. నేడు సీఎం వైయస్ జగన్.. ఐ ప్యాక్ టీమ్ వద్దకు వెళ్లి.. ఆయన మాట్లాడిన తీరుతో తనకు బాగా నవ్వు తెప్పించిందన్నారు. కూటమి కి తక్కువలో తక్కువ 125 అసెంబ్లీ స్థానాలు కూటమికి వస్తాయని.రఘురామకృష్ణరాజు దీమా వ్యక్తం చేసారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైయస్ అవినాష్ రెడ్డిపై వైయస్ షర్మిల ఘన విజయం సాధిస్తారన్నారు. తాను ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న ఉండిలో అటు వైసీపీ అభ్యర్థి PVL నరసింహరాజుకు, ఇటు టీడీపీ బహిష్కృత నేత శివరామరాజు కు ఇద్దరు అభ్యర్థులకు సీఎం జగన్ నిధులు సమకూర్చారని ఆరోపించారు.అయినప్పటికీ తాను గెలవబోతున్నట్లు రఘురామ అన్నారు. . అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్.. 55 వేల మేజార్టీతో గెలవబోతున్నారన్నారు. జగన్ పాలనలో ప్రజల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయాన్నారు .
