సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఈరోజు ఉదయం ఉండి నియోజకవర్గం, పాలకోడేరు మండలంలోని గొల్లలకోడేరు, గరగపర్రు, మైప గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణ రాజు మరియు ఉండి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.తదుపరి నేటి సాయంత్రం ఎంపీ రఘురామా .. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాకు బీజేపీ నుండి ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయిన సీఎం జగన్ ఉండి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూడా నాపై ఇద్దరు అభ్యర్థులను వైసీపీ తరపున పోటీ లో ఉంచారని ఇది వైసీపీ వారికీ శుభవార్త అని అన్నారు. వైసీపీ అధికారికంగా పివిఎల్ నరసింహరాజు అభ్యర్థి అయితే అనధికారికంగా టీడీపీ రెబల్ అభ్యర్థి శివరామరాజు పోటీ చేయిస్తున్నారన్నారు.. నాకు ఒకప్పటి మిత్రుడైన శివరామరాజు నామినేషన్ వెయ్యడానికి ఏకంగా 20 వేల మందికి భోజనాలు పెట్టి భారీ ఎత్తున ఖర్చు చేసి, టిడిపి ముసుగులో వైసీపీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారని ఆరోపించారు.. శివరామరాజుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని, మీకు చక్కటి స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తనకు తెలిసిందన్నారు. ఉండి ప్రజలు ఎప్పుడు టీడీపీ కి మద్దతు ఇస్తారు కాబ్బటి ఈసారి నిజమైన తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ల ఓటర్లు అందరు టీడీపీ అభ్యర్థిగా రఘురామా నే మాత్రమే బలపరచాలని జగన్ కు మద్దతుగా నిలచిన అనధికార వైసీపీ అభ్యర్థి శివరామరాజు వైఖరిని గమనించాలని అన్నారు.
