సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభంజనం ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచండము అయ్యింది.పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ఎంపీ రఘురామా జోస్యం నిజం అయ్యింది. 2014 ఎన్నికల సీన్ రిపీట్ అయ్యింది. వార్ వన్ సైడ్ అయ్యింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు లోను మరోసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం స్థానాలు గెలుచుకొంటుంది. జిల్లాలో మొదటి ఫలితం ఉండి నియోజకవర్గానిదే అధికారికంగా ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి రఘురామా కృష్ణంరాజు తన సమీప ప్రత్యధి వైసీపీ అభ్యర్థి పివిల్ నరసింహరాజు ఫై 56,777 ఓట్ల మెజారిటీ తో ఘన విజయం సాధించారు. అక్కడ సింహం గుర్తు ఫై బరిలోకి దిగిన శివరామరాజు కు 13,260 ఓట్లను మాత్రమే సాధించారు. ఆత్మీయులు ఎంపీ రఘురామా కృష్ణంరాజు కు సిగ్మా న్యూస్ తరపున ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాము.
