సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 3 రోజులలో నామినేషన్స్ తేదీలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఎన్నికలలో మరోసారి నరసాపురం ఎంపీ గా పోటీ చెయ్యాలన్న ఆశతో చంద్రబాబు సహకారంతో బీజేపీ పెద్దలతో అభ్యర్థుల మార్పులపై ఆఖరి సారిగా చేసిన చర్చల ఫలితాలు ఇంకా కనపడక పోవడంతో ఇక ఉండి నియోజకవర్గం నుండే టీడీపీ ఎమ్మెల్యే గా బరిలోకి దిగేందుకు అనివార్యంగా ఎంపీ రఘురామా కృష్ణంరాజు సంసిద్ధం అవ్వడమే కాదు.. గత 2 రోజులుగా పరోక్షంగా తన ప్రచారాన్ని కూడా ఉండి నియోజకవర్గంలో ప్రారంభించారు. స్థానిక కూటమి నేతలను కలుస్తున్నారు. ఉండి నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే కీలక నేతలను భీమవరంలో వారి నివాసాలలో స్వయంగా కలసి మద్దతు ను అభ్యర్ధించారు. సానుకూల స్వాందన వస్తున్నట్లు తెలుస్తుంది. నేడు, ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా భీమవరం, ఉండి గ్రామాలలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.తదుపరి ఉండి మండలం వెలివర్రు వీర పేరంటాలమ్మ వారిని జాతర మహోత్సవాల సందర్భముగా ఎంపీ రఘురామను దర్శించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని శ్రీ అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
