సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు.. నేడు, బుధవారం తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు, భాదిత కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని.. తాను ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నుండి ముందుచూపుతో చేపట్టిన పంట కాలువల ప్రక్షాళన, పూడికలు తీసివేత, ఇరిగేషన్ స్థలాలలో ఆక్రమణలు తొలగింపు కాలుష్య నివారణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఈ మొంథా తుఫాన్” విపత్తు సమయంలో ప్రజలను రైతులు కు పెను నష్టాల భారీ నుండి ఈ చర్యలు కాపాడయని.. అప్పుడు వ్యతిరేకించిన వారు సైతం ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రఘురామా కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తుపాన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆడుకొనే చర్యలు చెప్పటామని భరోసా ఇచ్చారు. పాలకోడేరు మండలంలో యనమదుర్రు డ్రైన్ యొక్క నీటి ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించి అధికారులు కు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు సహకార సంఘం చైర్మన్, కొత్తపల్లి నాగరాజు, కూటమి నేతలు ప్రజలు పాల్గొన్నారు,
