సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండిలో త్రిముఖ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. టీడీపీ అభ్యర్థిగా ఎంపీ రఘురామా కృష్ణంరాజు ,వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు మరోవైపు ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు హొరాహొరిగా తలపడుతున్న నేపథ్యంలో.. ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి జుత్తుగ నాగరాజు పుట్టినరోజు వేడుకలలో నేడు, శుక్రవారం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ రఘురామా కృష్ణంరాజు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొని వేడుకకు హాజరైన జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణ రాజు ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. రఘురామా కు పలువురు జనసేన నేతలు పరిచయాలు చేసుకొని సంఘీభావం ప్రకటించారు. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు గారి సతీమణి రమాదేవి నేడు, ఉండి మండలంలో కోలమూరు గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తు ఫై ఓటు వెయ్యాలని అభ్యర్ధించారు. మహిళలు ఆమెకు విశేషంగా మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *