సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం లోని వివిద ప్రాంతాల్లో లక్షలాది రూపాయల నిదులతో నిర్మించిన గ్రామ సచివాలయాలు, కమ్యూనిటీ హాల్సు, రైతు భరోసా కేంద్రాలు, CC రోడ్లు, వెల్నెస్ సెంటర్ల ను DCCB చైర్మన్ మరియు ఉండి నియోజకవర్గం వైసిపి ఇన్చార్జి PVL నర్సింహ రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు , వరుసగా ప్రారంభోత్సవాలు చేశారు. పేదల లకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను కూడా పలు గ్రామాల సచివాలయాలలో లబ్దిదారులకు కొయ్యే మోషేను రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మెన్ కుమారుడు కొయ్యే సుందరరాజు, గ్రామ సర్పంచ్ లు MPTC లు ZPTC లు పాల్గొన్నారు
