సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలోని తన కార్యాలయంలో( భీమవరం పట్టణ శివారు) నేటి సోమవారం సాయంత్రం ఆకివీడు, ఉండి మండలాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.. ఈ సమావేశంలో ప్లాస్టిక్ కంట్రోల్ నియంత్రణ, రోడ్లపై చెత్త వెయ్యకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, నిబంధనలు పాటించని దుకాణదారులపై పెనాల్టీలు వేయాలని, అయినా తిరిగి తప్పు చేస్తే వారి దుకాణాలకు చెందిన అనుమతులను రద్దు చెయ్యాలని నిర్ణయించామని, దీనికి కాస్త కష్టమైన స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు సహకరిస్తే పర్యావరణం రక్షిత, ఆరోగ్యకర ప్రాంతంగా ఉండి రాష్ట్రానికి ఆదర్శంగా మోడల్ గా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటికే కాలుష్య రహిత సాగునీరు, త్రాగు నీరులో ఉండి నియోజకవర్గం మంచి ఫలితాలు సాధించిందన్నారు.
