సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గం నుంచి తెలుగు దేశం అభ్యర్థిగా గత రాత్రి టీడీపీ తీర్ధం పుచ్చుకొన్న రఘురామా కృష్ణంరాజు కు టికెట్ ఇచ్చినట్లు చంద్రబాబు స్వయంగా మంతెన రామరాజు కు చెప్పారని మీడియాలో నేటి మధ్యాహ్నం వార్తలు హల్ చల్ చెయ్యడం తో ఉండిలో రామరాజు అనుచరులు టీడీపీ అభిమానులు, మహిళా నేతలు తీవ్ర ఆగ్రవేశాలు తో నినాదాలు చేసారు. రామరాజు కు టికెట్ ఇవ్వకుండా రఘురామా కు మారిస్తే ఇక్కడ సైకిల్ గుర్తు కనపడకుండా చేస్తామని చంద్రబాబు ను స్థానిక నేతలు హెచ్చరించారు. రామరాజు మద్దతు దారులు సాక్షత్తు చంద్రబాబు ఎదుటగానే వారి నిరసనలు తెలిపారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు క్యాడర్ ను శాంతపరిచే పనిచేసారు.తాను చంద్రబాబు ను కలసి వస్తునని ఉండి నియోజకవర్గ అభ్యర్థి మార్పుపై చంద్రబాబు అఫిషియల్ గా చెప్పలేదన్నారు. ఇంతకాలం కస్టపడి ప్రచారం చేసిన తరువాత సీటు మారుస్తారని తాను భావించడం లేదని ఒక వేళా సీటు రఘురామ కృష్ణంరాజుకు వెళ్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
