సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: సైబర్ క్రైమ్ లు కు హద్దు అదుపులేకుండా పోతున్నాయి. భీమవరం సరిహద్దులోని ఉండి గ్రామం లోని విశ్రాంత రిజర్వ్‌ ఎస్‌ఐ బ్యాంక్‌ ఖాతా నుంచి ఏకంగా రూ. 27 లక్షల నగదు మాయం చేసారు. ఉండి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. . ఎన్‌ఆర్‌పీ అగ్రహారానికి చెందిన చిగురుపల్లి నాగేశ్వరరావు రిజర్వ్‌ ఎస్‌ఐగా పనిచేసి రిటైర్‌ అయ్యాడు. ఆయనకు ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సొమ్ము రూ. 37 లక్షలు వచ్చాయి. ఆ సొమ్మును ఉండి ఎస్‌బీఐ ఖాతాలో వేశాడు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 19న ఆకి వీడులోని ఓ దుకాణంలో రూ.35 వేలతో ఏసీ కొనుగోలు చేశారు. ఏప్రిల్‌ 20న ఏసీ మెకానిక్‌ వచ్చి ఇంట్లో బిగించడంతో అతనికి రూ. ఎనిమిది వేలను తన బ్యాంక్‌ ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఎటువంటి విత్ డ్రాలు చెయ్యలేదు. అయితే ఈ సెప్టెంబర్ నెల లో గత సోమవారం డబ్బు అవసరం నిమిత్తం బ్యాంక్‌కు వెళ్లి ఖాతా వివరాలు చూశారు. పలు దఫాలుగా ఫోన్‌ పే ద్వారా రూ. 27లక్షలు డ్రా చేసినట్లు గమనించాడు. దీంతో ఆందోనళనకు గురయి బ్యాంక్‌ అధికారులను సంప్రదించాడు. అనంతరం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *