సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో రూ 80 లక్షలతో అదునాతనమైన అక్వాల్యాబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని , ఇటీవల అమెరికా సుంకాల నేపథ్యంలో రొయ్య ధర పడిపోయి రైతులకు వచ్చిన ఇబ్బందిని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకోని వెళ్లి పరిష్కారం సాధిస్తామని,ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని కాస్త ఓపిక పట్టాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. కోట్ల ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొని ఆక్వా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. . ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఆక్వా ల్యాబ్ ను ఆధునీకరణ చేస్తామని, 33% ప్రోటీన్లతో ఉన్న ఉన్న ఫీడును రూ 62 లకే రైతులకు అందజేస్తామని అన్నారు. 15 రోజులకు ఒకసారి కౌంట్ ధర నికరంగా ఉండేటట్లు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కొత్తపల్లి నాగరాజు సమన్వయము చేసారు.
