సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉండి ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన రఘురామా కృష్ణంరాజు మీడియా కు ప్రకటన విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు శాసన సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ అవకాశాన్ని కల్పించిన నా ఉండి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నారు. అయితే గతంలో నరసాపురం వైసీపీ పార్టీ ఎంపీ గా, లోక్ సభలో ప్రజా సమస్యలపై రికార్డు స్థాయిలో ఎక్కువ సార్లు మాట్లాడిన ఉత్తమ పార్లమెంటైన్ అవార్డు అందుకొన్న రఘురామా ముక్కు సూటి తనంగా వైసీపీ ప్రభుత్వంలో ఇసుక, మద్యం తదితర సమస్యలపై ప్రజా వ్యతిరేకతను ముందే గమనించి అధినేత సీఎం జగన్ ను నిలదీసిన రఘురామా, తదుపరి పరిణామాలలో పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేసి వైసీపీ పతనంకోసం మీడియావేదికగా ప్రతిపక్షాలకు మించి పోరాడిన రఘురామా కు కూటమి నుండి ఇంకా తగిన గౌరవం లభించలేదన్నది సుస్వష్టం.. ఎంపీ కి బదులుగా టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించి నప్పటికీ ఆయన గౌరవానికి భంగం లేకుండా స్పీకర్ లేదా కీలక మంత్రి పదవి ఇస్తారని ఆశించిన ఆయన అభిమానులు భంగపాటు కు గురి అయ్యారు. అయితే ఇటీవల ఉండి నియోజకవర్గం అభివృద్ధి కి రఘురామా ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్చందం గా అనేక మంది దాతలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రూపాయలు విరాళాలు గా ఇవ్వడం గమనార్హం. అక్కడ దాతల పేరుమీదనే ఎటువంటి అవినీతి లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని రఘురామా ఇప్పటికే స్వష్టం చేసారు.
