సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజు కూడా కొనసాగించారు. అయితే డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాలరత్నం ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపి నిమ్మ రసాన్ని అందజేశారు. అనంతరం ఉండిలో పలువురు టీడీపీ నేతలు చేప్పట్టిన రిలే నిరాహార దీక్షల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో శాంతియుత మార్గంలో నిరసన తెలిపే హక్కు ఉందని, ప్రభుత్వం ఆదేశాలతో పోలీసుల తీరు అతిగా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
