సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి నేడు, మంగళ వారం ఉండి మండలం, ఉండి గ్రామ సచివాలయం, 24×7 పిహెచ్సి ని జిల్లా కలెక్టరు అస్మిక తనిఖీ చేశారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల హాజరును, ప్రభుత్వ పథకాలు అమలు తదితర అంశాలను జిల్లా కలెక్టరు పరిశీలించారు. వివిధ సమస్యలు పై వచ్చిన ధరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.సచివాలయం బయట డిస్ప్లే చేసిన బోర్డులను పరిశీలించి ,ప్రభుత్వ వివిధ పథకాలు ,లబ్ధిదారుల జాబితా తప్పనిసరిగా చేయాలని అధికారులకు సూచించారు. పీహెచ్సీలలో వైద్య సేవలు విస్తృతంగా అందించాలని అధికారులను ఆదేశించారు. హాజరు పట్టీని పరిశీలించి ,రోజుకు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారు. ఈ నెలలో ప్రసూతి కేసులు ఎన్ని వచ్చాయి అని జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు సక్రమంగా రావడం లేదని ప్రజలకు సక్రమమైన వైద్య సేవలు అందడం లేదని పిర్యాదులు వస్తున్నాయని, డాక్టర్లు , సిబ్బంది ఖచ్చితంగా సమయానికి హాజరై ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *