సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల సీఎం జగన్ ముందే టికెట్ నిర్ణయించడంతో గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలలో సుడిగాలిలా పర్యటిస్తున్న ఆమె నేడు, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి P.V.L నరసింహారాజు అధ్వర్యంలో,గోకరాజు రామరాజు పాల్గొనగా నిర్వహించిన భారీ బైక్ మరియు కార్ ర్యాలీలో పాల్గొన్నారు.భీమవరం శివారులో ఉన్న పెదఅమిరం గ్రామంలో ఉన్న ఉండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్యాంప్ కార్యాలయం నుండి పాలకోడేరు మండలం, గొల్లలకోడేరు – గరగపర్రు – వయా యండగండి- మైప – కోరుకొల్లు – మోగల్లు -పాలకోడేరు – వేండ్ర- శృంగవృక్షం – పెన్నాడ- గోరగనమూడి- విస్సాకోడేరు- కుముదవల్లి గ్రామం వరకు జరిగిన భారీ ర్యాలీలో వందల సంఖ్యలో బైకులు, కార్లు వేల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు. మహిళలు పలు చోట్ల ఆమెకు హారతులు ఇచ్చి తమ మద్దతు పలకడం గమనార్హం..
