సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘అయినను.. ‘ఉండి సీటు రఘురామదే… వెనక్కి తగ్గనున్న రామరాజులు..?’ అంటూ నిన్న ఉదయం మన సిగ్మా ఆన్ లైన్ న్యూస్ లో వచ్చిన సమాచారం వాస్తవ రూపం ధరిస్తుంది. నిన్న మధ్యాహ్నం ఉండి ఎమ్మెల్యే రామరాజు అభిమానులు టికెట్ నిలుపుకోవడానికి ఎలా ప్రతిస్వాదించారో.. అందరు చూసారు.. తాజా పరిణామాలతో జరుగుతున్నా నష్టాన్ని భర్తీ చేసేందుకు ఉండి నియోజకవర్గం నేతలతో.. రామరాజు తో సహా.. టీడీపీ అధినేత చంద్రబాబు నేటి శుక్రవారం ఉదయం అమలాపురం లో తాను బసచేసిన కిమ్స్ గెస్ట్ హౌస్ లో కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణంరాజుకు కేటాయింపు విషయాన్నీ ద్రుష్టి లో పెట్టుకొని చంద్రబాబు క్యాడర్ కు బుజ్జగింపు ధోరణిలో.. తాను ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గం నేతలతో భేటీ అవ్వాల్సి వస్తోందన్నారు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను భావించలేదని అన్నారు. పొత్తుల కారణంగా కొన్ని సీట్లు తలకిందులు అయ్యాయని పార్టీ కేడర్‌ తదుపరి నిర్ణయానికి సిద్ధంగా ఉండాలని చెప్పకనే చేప్పారు. నరసాపురం ఎంపీ సీటు అనుకోని విధంగా బీజేపీకి వెళ్లడం వలన సమస్య మొదలయింది. ఉండి ఎమ్మెల్యే రామరాజుపై నాకు చాలా గౌరవం ఉంది. ఆయనపై ఎలాంటి వివక్ష లేదు. ఏవిధంగా రామరాజుకు న్యాయం చేయాలనేది ఆలోచిస్తున్నాము. కార్యకర్తలకు చెప్పాలని పిలిచాము. ఇటు రామరాజు..అటు రఘురామలకు న్యాయం చేయాలి. రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. రామరాజు మొన్నటి ఎన్నికల్లో బాగా పనిచేశారు. ఇప్పుడు కూడా కస్టపడి ప్రచారం చేస్తున్నాడు. అయితే రఘురామ జగన్ బాధితుడు. నాలాంటి వ్యక్తి కూడా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇలా అందరినీ జైల్లో పెట్టి అధికారం చెలాయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. రఘురామ.. వంటి వ్యక్తులకు పార్టీ అండగా ఉండవలసిన అవసరం ఉంది. అలానే పార్టీని నమ్ముకున్న రామరాజును న్యాయం చేస్తాం. నేటి మధ్యాహ్నం ఈ విషయం ఫై మరోమారు బీజేపీనీ కలసి అభ్యర్ధిస్తాం.. కో ఆర్డినేషన్ పై చర్చించుకుంటున్నాము. ఉండి కార్యకర్తలు అర్థం చేసుకుని సంయమనం పాటించాలి.’ అని చంద్రబాబు వారిని బుజ్జగించారు. ఏది ఏమైనా ఏ క్షణంలో నైనా రఘురామ కృష్ణంరాజు పేరును ఉండి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *