సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ప్రధాన సెంటర్ లో నేడు, శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామా కృష్ణంరాజు ను గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ ను కూడా బలపర్చాలన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. మూడు పార్టీలు ఇక్కడ.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో అని.. ఒక విధ్వంసకారుడని పేర్కొన్నారు. ఎంపీ రఘురామ కృష్ణరాజును ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసని చంద్రబాబు అన్నారు. అయిన సరే, జగన్‌పై రఘురామ సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని, ఆయనకు న్యాయం చేయడం కోసమే, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామన్నారు. జగన్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు టిడ్కో ఇళ్లు ఇస్తాం. కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. ఆక్వా రైతులకు యూనిట్ 1.50 రూపాయలకే కరెంటు ఇస్తాం. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఆయన ఒక హీరోనే అని ప్రశంసించారు.రఘురామా మాట్లాడుతూ.. జగన్ సర్కార్ మద్యం పేరుతో కోట్లు దోచేశారని, నకిలీ మద్యం తాగితే మీకు అనారోగ్యం వస్తుంది. రాష్ట్రంలో కుంభకోణాలే కుంభకోణాలు. ఇసుకను దోపిడీ చేస్తున్నారు. మీ భూములు కొట్టేయడానికి ప్లాన్ వేశాడు. 30 లక్షల ఇళ్లు కడతానన్నాడు..కట్టించాడా? నేను గెలవగానే ఉండి ని మరింత అబివృద్ధి చేస్తాను. ఆకివీడు పేరుకు పట్టణం ప్రభుత్వ సహకారం లేక అభివృద్ధి శున్యం గా ఉంది. దానిని సుందరంగా చేస్తాను. ప్రజలను, రైతులను సంక్షేమం తో ఆదుకొంటాను . యువతకు ఉపాధి కల్పిస్తాను అని హామీలు ఇచ్చారు.
