సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా నేడు, మంగళవారం అక్టోబర్ 3వతేదీ రైతు కార్మిక సంఘాలు బ్లాక్ డే నిర్వహించాయి. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లో CITU -AITUC రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా CITU -AITUC జిల్లా అధ్యక్షులు, జె వి ఎన్ గోపాలన్ మరియు కోనాల భీమారావు మాట్లాడుతూ .. గతంలో రైతు ఉద్యమం సందర్భంగా గతంలో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు కోరుతూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రైతులపైకి కారుతో దూసుకువెళ్ళి నలుగురు రైతులను కిరాతకంగా హత్య చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని, ఈదుర్ఘటనలో ప్రధాన కుట్రదారుడుగా వున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేసి రైతులకు న్యాయం చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
