సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉక్రెయిన్ ఫై సుదీర్ఘ కాలంగా జరుగుతున్నా రష్యా దురాక్రమణను ఐక్య రాజ్య సమితి తాజా సమావేశంలో పాల్గొన్న అన్ని దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్ భూభాగంలోని నాలుగు ప్రాంతాలను చట్టవిరుద్ధంగా రష్యా ఆక్రమించి తన దేశంలో కలిపివేసుకోవడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానం పై ఐక్య రాజ్య సమితి అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యు లున్న సాధారణ అసెంబ్లీలో.. రష్యా వ్యతిరేక తీర్మా నానికి 143 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. దీంతోయుద్ధం ఆపేయాలంటూ ప్రపంచ దేశాలు రష్యా కు బలంగా పిలుపు ఇచ్చినట్లయ్యిం ది.అయితే రష్యా తో పాటు ఇండియా, ఉత్తర కొరియా, బెలారస్, సిరియా, కరేబియన్ దేశం నికరాగ్వా లు ఓటింగ్‌కు గైర్హాజరుఅయ్యా యి. మరో 35 దేశాలు ఓటింగ్ కు హాజరుకాలేదు. కష్టమో నష్టమో ? భారత్ కు ఎన్నో కష్టా సమయాలలో అండగా ఉన్న చిరకాల మిత్రుడు రష్యా పట్ల భారత్ తీరు మారలేదు.. ఇక ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరి మారడం లేదు. తటస్థ తీరునే అవలంభిస్తూ వస్తోంది. తాజాగా ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ కు దూరంగా ఉండి మద్యే మార్గం అనుసరించింది. ఇప్పుడు బాధిత దేశం ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలో భారత్ కు పలు విషయాలలో వ్యతిరేకంగా వ్యవహరించడం గమనార్హం..
