సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, భుధవారం అమరావతిలో కలెక్టర్ల సదస్సు లో చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.. అలాగే కీలక ప్రకటనలు చేశారు. ఉగాదికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తామన్నారు. కలెక్టర్లు ఇకపై క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందించాలని.. జూన్‌లో మరికొందరికి ఇళ్లు అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్ పేరిట ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని.. కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూడౌన్ చేసిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని చెప్పారు సీఎం. రాష్ట్రంలో 6 లక్షల సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఉగాదికి దివ్యాంగులకు ఉచిత బస్సు ఇంద్రధనస్సు పేరుతో సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తామన్నారు
