సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉగాదిని పురస్కరించుని మార్చి నెల లో ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొక్కులు భారీగా నాటే కార్యక్రమానికి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తాజగా సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారుల వెంట, ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.ఇక రైతుల భూములలో పండ్ల రకాలను నాటాలని, ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎం చంద్రబాబుతో తాను చర్చిస్తానన్నారు. దీనిపై ఫిబ్రవరి 5వ తేదీన మరోసారి సమావేశం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం పచ్చదనం ఉందని, 2030 నాటికి 37 శాతానికి చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని పవన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *