సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ, దేశంలో పలు చోట్ల మారణకాండ తో అలజడి సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారన్న అభియోగంపై పీఎఫ్ఐ సంస్థ తో సంబంధం ఉన్న సభ్యులు, కార్యాలయాలపై..ఇటీవల 3వ విడతగా నేడు, మంగళవారం కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ NIA, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED ఆయా రాష్ట్ర పోలిసుల సహకారంతో మరో సంయుక్త ఆపరేషన్ దాడులు నిర్వహించారు. వీరి దాడులలో దుబాయ్ తదితర విదేశాల నుండి ఇప్పటికే వారి ఖాతాలలో 120 కోట్ల రూపాయలు నిధులు జామా చేసిన సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మతోన్మాదం తో ఒక వర్గం యువకులకు దేశంలో ప్రముఖ నేతలను టార్గెట్ చేస్తూ విద్రోహాలపై శిక్షణ ఇస్తున్నారని రిపోర్ట్ .. పైకి మాత్రం ఉచితంగా కరాటే , జూడో వంటి స్వయం రక్షణ విద్యలు నేర్పుతున్నామని ముసుగు వేస్తున్నారని అధికారులు తమ దర్యాపు లో తేలిందంటున్నారు. దేశంలో 8 రాష్ట్రాల్లో సంయుక్తంగా దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. నేడు, మంగళవారం దక్షిణాది రాష్ట్రము ఒక్క కర్ణాటకలోని 45 మంది పీఎఫ్ఐ సంస్థ కు చెందిన యువకులను అరెస్ట్ చెయ్యడం సంచలనం రేపింది. ఇంకా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, అస్సోం లో దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, ఇవి అక్రమ అరెస్టులు అంటూ దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ ప్రతినిధులు పలు చోట్ల ర్యాలీలు నిర్వహించడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *