సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరదల నేపథ్యంలో ఆగిపోయిన ఇసుక తీత మరలా మొదలయింది. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉచిత ఇసుక పధకం మాట దేవుడు ఎరుగు .. ఆ ఇసుక నిర్మాణాల వద్దకు తరలించడానికి చార్జీలు ఖర్చులు తడిపిమోపెడు అవుతున్నాయి.. దీనితో ఈ తప్పులు సరిదిద్దటానికి రవాణా చార్జీలు కంట్రోలు చెయ్యడానికి తాజా నిబంధనలు విడుదల చేసారు. దీని ప్రకారం.. ఇసుక తవ్వకం, లోడింగ్ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్‌టీ 18శాతం, డిస్ర్టిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) రూ.19.68, మెరిట్ (ఖనిజాన్వేషన్ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు. ఇవికాకుండా లబ్ధిదారుడు రవాణా చార్జీలు పెట్టుకోవాలి. ఇక ర్యాంపుల్లో ఒక పైసా కూడా అదనంగా తీసుకోవడానికి వీలులేదు. కానీ కొందరు రవాణా చార్జీల పేరిట ఎక్కువ వసూలు చేస్తున్నట్టు స్టాక్ పాయింట్లలో తేలడంతో రవాణాచార్జీలను ప్రభుత్వమే నిర్ణయిస్తూ జీవో జారీచేసింది. ఇసుక ర్యాంపు నుంచి 10 కిలోమీటర్ల వరకూ 4.5 టన్నుల ట్రాక్టర్‌కు రూ.13.5 రవాణా చార్జీ నిర్ణయిం చారు. తర్వాత 11 నుంచి 20కిలోమీటర్ల వరకూ రూ.12.8, 21 నుంచి 30 కిలోమీటర్ల వరకూ రూ.12.8, 31నుంచి 40 వరకూ రూ.12.8, 40 నుంచి 80 కిలోమీటర్ల వరకూ రూ. 6.3 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. ఇక 80 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం ఉంటే కిలోమీ టరుకు రూ.35 అదనంగా వసూలు చేయవచ్చని నిర్ణయిం చారు.
