సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాష్ట్రంలో మహిళలుకీ ప్రభుత్వ ము సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన వంటిటి గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఎప్పుడు ఇస్తారో? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై నేటి బుధవారం 3వ రోజు అసెంబ్లీ సమావేశాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ వివరణ ఇచ్చారు.. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు.. అయితే గత 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంత మందికి ఇస్తున్నారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి వివిధ శాఖల అధికారులతో చర్చించి సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తాం అని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో .. అధికారుల తీరుపై అసం తృప్తి ప్రకటించారు. అధికారులు మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని విమర్శలు చేసారు. తాము అడిగిన సమాచారం కానీ ప్రశ్నలకు కానీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని పేర్కొంటూ ఇటీవల గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారం తనకు అసంతృప్తి గా ఉందన్నారు.
