సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ద్వారా పేదప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని దేశవ్యాప్తంగా మరో ఐదేళ్లపాటు పొడిగించినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. దీనివల్ల 80 కోట్లమంది లబ్ధి పొందనున్నారని తెలిపారు. కొవిడ్ సమయంలో రేషన్‌కార్డు మీద కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల బియ్యం చొప్పున కేటాయిస్తూ కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం తీసుకొచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ పథకం గడువును పెంచుతూ వస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ సర్కారు మరోసారి ‘పీఎంజీకేఏవై’ పథకం గడువును పొడిగించింది. శనివారం ఛత్తీసగఢ్‌లోని డంగ్లో జరిగిన ఎన్నికల సభలో ఆయన దీనిపై ప్రకటన చేశారు.
