సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో వేలాది కోట్ల ప్రభుత్వ నిధులతో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేప్పటి తన ప్రభుత్వ హయాంలోనే వాటిలో 6 కాలేజీలు పూర్తీ చేసి ప్రారంభించానని, మరో కాలేజీ ఇటీవల ప్రారంభం అయిందని మరో 10 కాలేజీలు దాదాపు పూర్తీ కావస్తున్నా నేపథ్యంలో వాటికీ ప్రభుత్వ నిధులు ఇవ్వకుండా సీఎం చంద్రబాబు తనవారికి పిపిపి విధానం అంటూ ప్రవేటు పరం చేస్తున్నారని, ప్రజా సొమ్ము లూటీ అవుతుందని మాజీ సీఎం జగన్ విమర్శలకు ప్రతిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసలు జగన్ ఒక కాలేజీ మినహా ఏమి కట్టలేదని మా ప్రాంతంలో ఎక్కడైనా కట్టాడా? నిరూపించమని సవాల్ విసరడం తో దానిని స్వీకరించిన జగన్ నేడు, గురువారం అయ్యన్న పాత్రుడు నియోజకవరం లో 55 ఎకరాల భూమి లో 500 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకొంటున్న మెడికల్ కాలేజీ వద్దకు బయలు దేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖపట్నం నుండి నర్సీపట్నం వరకు వర్షంలో సైతం ఉత్తరాంధ్ర లో ఎక్కడ చుసిన వేలాది వైసీపీ అభిమానుల కోలాహలంతో జగన్ అభివాదాలతో పర్యటన ‘ఒక బలప్రదర్శన’ తరహాలో జోరుగా సాగింది. గాజువాక నగర్లోని, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నేతలు జగన్ ను కలువగా .. వారికి తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను పూర్తిగా వ్యతిరేకమని, గతంలో ప్రధాని మోడీని వేదికపైనే ప్రశ్నించానని, తాను ఇప్పటికి కార్మికుల పక్షాన నిలబడతానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. మాధవరావు పాలెం లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ వరకు జగన్కు వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. మెడికల్ కాలేజీ వద్ద జగన్ మీడియాతో మాట్లాడుతూ..అమరావతి కి లక్షల కోట్లు ప్రజా ధనం గుమ్మరిస్తున్న చంద్రభాబు సర్కార్ మెడికల్ కాలేజీల పూర్తీ చెయ్యడానికి 4 500 కోట్లు కేటాయించలేదా? సీఎం చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు అబద్దాలు, మోసపు మాటలు ఆపాలని , పేదవారికి వైద్యం, వైద్య విద్య అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో నేను ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలు ప్రవేటు పరం కానివ్వమని, పోరాటాం చేస్తామని ప్రకటించారు.
