సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లకు, కీలక మావో నేతల మరణాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు, ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టులు (Maoists)పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే దీని ప్రభావం ఎక్కువ ఉండే ఉత్తాంధ్ర జిల్లాలలో.. మావోలు ప్రతీకార చర్యలు దిగే అవకాశాలు ఉండటంతో ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రజలలోకి వెళ్లకూడదని ఏదయినా కార్యక్రమం ఉంటె పోలీసులకు తెలియజేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఏపీ పోలీసులు. మరోవైపు, ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ముందస్తుగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నిలిపివేశారు. పాడేరు డిపో నుంచి వివిధ సర్వీసులను కుదించారు. నైట్ హాల్ట్ బస్సులను మండల కేంద్రాలకే పరిమితం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే ఉచిత బస్సును అవుట్ పోస్టు వరకు మాత్రమే నడిపేందుకు అనుమతి ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *