సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్దానిక డి.యన్.ఆర్ కళాశాల విద్యార్ధినీ, విద్యార్ధులు ఈ నెల 10 వ తేదీ నుండి 14 వ తేదీ వరకూ ఉత్తరాఖాండ్ ఖటిమ లోని లో జరుగు 38 వ జాతీయ క్రీడలలో మా విద్యార్ధినీ విద్యార్ధులు మల్లఖంబ్ క్రీడలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు. కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల కార్యదర్సి మరియు కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) పాల్గొని గత కొన్ని సంవత్సరాలుగా మాకాలేజి విద్యార్ధులు మల్లఖంబ్ మరియు రోప్ స్కిప్పింగ్ లో జాతీయ స్దాయిలో పాల్గొని విజేతలుగా నిలవడం అభినందనీయం అని తెలిపారు. ఈ విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్న మా పాఠశాల పి.యి.టి జి.పి.సి శేఖర్ రాజు ను అభినందించారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా.బి.వి.నరసింహరాజు వివరాలు తెలుపుతూ డిగ్రీ కళాశాల నుండి 5 గురు విద్యార్ధులు కె.వేణు సాయి – బి.ఎ.తృతీయ సంవత్సరం, ఆర్. ఏసు, బి.కాం మొదటి సంవత్సరం, డి.ప్రసాద్, బి.ఎ మొదటి సంవత్సరం, బి.సతీష్ బి.కాం మొదటి సంవత్సరం విద్యార్ధులు మరియు జూనియర్ కళాశాల నుండి 3 విద్యార్దినీ విద్యార్ధులు పి.గోపీ కృష్ణ, జానియర్ ఇంటర్, జి.దివ్య జ్యోతి సీనియర్ ఇంటర్, బి.గోపిక ఆదిసాయి జూనియర్ ఇంటర్ ఈ పోటీలలో పాల్లొనటం విశేషం అని తెలిపారు.
