సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏది ఏమైనా ఈ మధ్య తెలుగు రాష్ట్రాలకు వర్షాలు తగ్గేదే లే .. అంటున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర ఆంధ్ర , గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు నేటి సోమవారం సాయంత్రం నుండి వరుసగా 4 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్ర తీరా ప్రాంతంలో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
