సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇటీవల డీఏ ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్తూ కార్మికులు, వాలంటీర్లు పనులు తాము చేయలేమని సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై మునిసిపల్ ఉద్యోగులు కార్మికులు, ఆరోగ్యశ్రీ బకాయిల కోసం ప్రెవేటు హాస్పటల్స్ , విద్యార్థుల ‘పీజు రియంబర్స్మేంట్’ బకాయిల కోసం ప్రెవేటు డిగ్రీ కాలేజీ ల యాజమాన్యాల ఆందోళనలు సమ్మెలు ఉపందుకొంటున్నాయి. కొన్ని చర్చల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో కట్టించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రెవేటు లేదా పిపిపి పరం చెయ్యవద్దని ఉద్యమము ఎలానూ ఉంది. పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పుల ఉంది. ఇదిలా ఉండగా తాజగా . సహ కార సంఘాల ఉద్యోగులు ఉద్యమబాట పట్టనున్నారు. పెండింగ్‌లో వున్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు సోమవారం ఒక రోజు ఆందోళన పట్టనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వున్న సహకార సంఘాలను బంద్ చేసి, రేపు చలో విజయవాడ ఆప్కాబ్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నారు. దీనికి జిల్లాలోని 254 సొసైటీలకు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది హాజరు అవుతారని ప్రతినిధులు తెలిపారు. రైతులకు సేవలు అందిస్తున్నతమ సమస్యలపై గత పది నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఒక రోజు ధర్నాకు సిద్దమౌతున్నట్లు ప్రకటించారు.( up file photo)
