సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు ఉద్యమించడానికి సిద్ద పడుతున్నారు. గత 16 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వార్డు సచివాలయంలో వాలంటీర్లను తొలగించి వారి విధులను ఇంటిటికి వెళ్లి తమను చేయ్యాలనడం దారుణమని ఆ వాలంటీర్లు విధులను సచివాలయ ఉద్యోగులకు విముక్తి కలిగించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ ఎండీ జానీ పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ,కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశంలో మాట్లాడారు. ఎంతో చదువుకొని వచ్చిన సచివాలయ ఉద్యోగులకు పని ఒత్తిడి పెంచి వాలంటీర్లు గా మార్చేసి బానిసలుగా భావిస్తున్నారా? వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని, ఆరేళ్లుగా ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్నందున ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, రికార్డు అసిస్టెంట్ పేస్కేల్‌తో క్యాడర్ అప్ గ్రేడ్ చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. వందలాది సచివాలయ ఉద్యోగులు హాజరు అయిన ఈ సమావేశంలో నాయకులు బత్తుల అంకమ్మరావు, యువ షణ్ముఖ, కేవీ.రాజేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు
