సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు ఏలూరులో జరిపామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేడు, సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. 26 జిల్లా‌ల కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులందరితో సమస్యలపై చర్చించామని బొప్పరాజు తెలిపారు. ఐఆర్, 12వ పీఆర్సీలో గతంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతూ తీర్మానం చేశామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని తెలిపారు. ఒక్క రీపోలింగ్ లేకుండా అత్యధిక పోలింగ్ శాతం జరిగేలా చేశామన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం సంతోషమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొందరు ఉద్యోగులపై కొత్త ప్రభుత్వం అనుమానంతో చర్యలు తీసుకోవడం సమంజసం కాదని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా..‌వారి ఆదేశాలను ఉద్యోగులు పాటిస్తారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని బొప్పరాజు పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఎక్కడ ఏ అవసరం లేని కాగితాలు కాలిన సరే.. రికార్డ్స్ రెవెన్యూ ఉద్యోగులే తగలెబెట్టేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, ఉద్యోగులంతా భయపడిపోతున్నారన్నారు.వాస్తవానికి అటువంటిది ఏమి లేదని ఇది మీడియా సోదరులు కూడా గమనించాలని.. పురాతన శాఖ రెవెన్యూ శాఖలో అనేక రికార్డులు ఉన్నాయన్నారు. ఈ రికార్డుల భద్రతకు రికార్డు అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలన్నారు. పదేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అసలు రెవెన్యూ కార్యాలయాలకు ఒక వాచ్ మెన్ కూడా లేరన్నారు. వందలాది రికార్డులు ఉండే కార్యాలయాలకు భద్రత అవసరం‌ లేదా? అని బొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగులు చేసే పనికి, కార్యాలయం నిర్వహణకు ఖర్చులు ఉంటాయని.. నెలకు 54 రూపాయలు ఇస్తే ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. వీవీపీలు వస్తే లక్షల రూపాయలు బడ్జెట్ అవుతుందని.. అదంతా ఎక్కడి నుంచి ఉద్యోగుల తెచ్చి ఖర్చుపెట్టాలని నిలదీశారు. సిసి కెమెరాలు పెట్టాలని‌ ఆదేశాలు ఇచ్చారని.. నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *