సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు నేడు, శనివారం నిరసన దీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగా నల్ల కండువాలతో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఫ్ల కార్డులతో ఆందోళనకు చేసారు . ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 11వ పీఆర్సీ ప్రతిపాదిత స్కేళ్లు అమలు చేయాలని, పీఆర్సీ అరియర్లు, పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీలో ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో సర్కార్ ఉందని బొప్పరాజు విమర్శించారు. ఉద్యోగులకే రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా? వాలంటీర్లు, సలహాదారులుగా ఉన్న వారికి రూ. 20 వేల కోట్లు ఇస్తున్న మాటను ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. మలిదశ పోస్టర్లు విడుదలతో ఉద్యమం మొదలై తీవ్రతరం అవుతుందన్నారు. ప్రభుత్వ యాప్ వినియోగాన్నికూడా నిలిపి వేస్తూ సెల్ ఫోన్ డౌన్ చేస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.
