సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, సమస్య ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 5వ తేదీ వరకు చర్చలకు వేచి ఉంటాం..ఈలోగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సమస్య ను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. లేదంటే.. ఉద్యమం తప్పదు. ఫిబ్రవరి 5న కర్నూలులో జరిగే సం ఘం 3వ రాష్ట్ర మహాసభల్లో ఉద్య మ కార్యా చరణను ప్రకటిస్తాం ’ అని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్, బోప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతపురంలో ఆయన జేఏసీ కార్యదర్శి జనరల్ వైవి రావు , జిల్లా ఛైర్మన్ దివాకర రావు , నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నప్ప తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘న్యాయంగా రావాల్సిన బకాయిలనే అడుగుతున్నాం . 2022 జనవరి 15న సీఎం జగన్ చర్చలు లో సీఎం స్వయంగా ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు. ఇటీవల రాష్ట్రం లో రెండు సంఘాల నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎప్పటి నుంచో సంఘాల మధ్య మనస్పర్థలున్నయి. అయితే . సంఘాల మధ్య ఐక్య త లేదన్నది నిజం కాదు.ఉద్యమంవస్తే కలిసే పని చేస్తాం . ఉద్యో గుల ప్రయోజనాల దృష్ట్యా సంఘాలు భేదాభిప్రాయాలను పక్క న పెట్టాలి’అని బొప్పరాజు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *