సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ముంగిట… ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో నేటి సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ప్రభుత్వం తమకు రూ.6,700 కోట్లు బకాయిలు పడిందని, గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
