సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బాగా ఆలస్యం అయినప్పటికీ గత 3 రోజులుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు ఉపందుకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో చలి వణికిస్తుంది.ప్రజలలో ఒళ్ళు నొప్పులు జ్వరాలు పెరిగాయి. దానికి తోడు.. ఇటీవల మొంథా తుఫాన్ తో వణికిన ఆంధ్రప్రదేశ్ ఫై ఇప్పుడు మరో అల్పపీడనం దూసుకొని రాబోతుంది. ఈ నవంబర్ 24-27 తేదీల మధ్య కోస్తా ఆంధ్ర , రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగి, కొన్ని చోట్ల 6 డిగ్రీలకు పడిపోగా, మరికొన్ని చోట్ల 35 డిగ్రీలకు పైగా వేడి కొనసాగుతోంది. ఈ వాతావరణ మార్పులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
