సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహా కుంభమేళా లో పవిత్ర స్నానం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మారిన శరీర ఆకృతిని ఉద్ద్దేశిస్తూ అనుచిత పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి, ఎక్స్‌ ఖాతాలో ఉపముఖ్యమంత్రిపై పోస్టు పెట్టారు. ఇటీవల మహాకుంభమేళాలో కుటుంబసభ్యులు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి కలిసి పవన్ పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. పవన్ పుణ్య స్నానం చేస్తున్న ఫోటోకు మరో సినీ .కామిడి నటుడు సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ సోషల్ మీడియాలో పెట్టడంతో అది బాగా వైరల్ అయ్యి పెద్ద రచ్చకు దారి తీసింది.దీనిపై జనసేన నాయకుడు రిషికేష్ కావలి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉపముఖ్యమంత్రిని కించపరుస్తూ ఇలా అనుచిత పోస్టు పెట్టడం పట్ల కూటమి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *