సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో హోమ్ మంత్రి అనిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా నంబర్ల 185 అగ్నిమాపక స్టేషన్ల సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి తెలిపారు. ఎక్కడైనా ప్రజలకు ప్రమాదాలు జరిగితే.. 100 లేదా 101 నంబర్లకు ఫోన్లు చేసి టపాకాయల అక్రమ తయారీపై పోలీస్, ఫైర్ వ్యవస్థలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. కోనసీమలో మండపేట మండలం ఏడిద గ్రామం తరహా దీపావళి టపాకాయల పేలుడు ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పర్యావరణరహిత టపాకాయలకు పెద్దపీట వేస్తూ దీపావళి జరుపుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
