సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో నేడు, మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్ని కలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెం ట్ హౌస్‌లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని మోడీ వేశారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. నేటి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తదుపరి సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం చేసి నేటి రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఏజెంట్లుగా కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రామ్ మోహన్ నాయుడు, శివసేన ఎం పీ శ్రీకాంత్ షిండే వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ.రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉన్నారు మొత్తం 781 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేడీ , శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే ఆమ్ అండ్ ఆద్మీ ఎంపీలు మరి కొన్ని పార్టీల ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసారని ఆరోపణలతో కాస్త అలజడి రేగింది.
