సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి నేటి ఆదివారం కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భీమవరం లో గత రాత్రి నుండి నేటి ఆదివారం మాదేహానం వరకు చెదురుమదురుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాతావరణం ముసురు కమ్ముకోవడంతో రేపటి దీపావళి కి బాణాసంచా షాప్ లకు , కిరానా వ్యాపార వర్గాలకు కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈ శీతాకాలం లో వర్షాలు కు తోడు ఈ నెల 21వ ఎల్లుండి మంగళవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. . అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీలో తేలికపాటి నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *