సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎండలు మండుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నా యి. గత సాయంత్రం గోదావరి జిల్లాలలో వర్షాలు పడ్డాయి. భీమవరంలో గత శుక్రవారం సాయంత్రం 6గంటల నుండి 2 గంటల పాటు భారీ వర్షం కురవడంతో గత 12రోజులుగా ఎండల భారిన పడిన ప్రజలకు ఉపశమనం కలిగింది. వర్షపు నీటితో చక్కటి మట్టి సువాసన తో ప్రజలు ఆస్వాదించారు. డెల్టా ప్రాంత రైతులు సంతోషించారు. అయితే తాజగా సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పై ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉంది. దీనికి తోడు సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగుతున్నది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉం దని వాతావరణ శాఖ ప్రకటించింది.
