సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగారానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో .. పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నేడు శుక్రవారం సాయంత్రం నుండి పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఇక శనివారం ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వచ్చే ఆదివారం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *