సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2వారాలుగా చలిగాలులు , చిన్న చినుకులు మినహా పెద్దగా వర్షాలు లేకపోవడంతో ప్రజలు వ్యాపారస్తులు ఊపిరి తీసుకొన్నారు. అయితే తాజగా బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం , ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ వర్షాలు దంచికొడుతున్నాయి. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
