సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో జగన్ సర్కార్ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఎం, సిపిఐ పార్టీలు డిమాండ్ చేసాయి.సిపిఎం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం మరియు ,సిపిఐ జల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ.. ఉపాద్యాయ, ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని వారు న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిపిఎం,సిపిఐ, వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు తెల్పుతున్నాయని బలరాం ఈ సందర్బంగా తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయుల, ఉద్యోగుల ఎడల స్నేహపూర్వక దోరణి కాకుండా కక్షసాదింపు ధోరణులకు, ప్రభుత్వం పాల్పడుతుందాన్నారు. ఇది చాలా దారుణమని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీంని పుణరుద్దరిస్తామని పాదయాత్ర సందర్భంలో జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే వామపక్షాలు ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబూరావు, జె.ఎన్.వి గోపాలన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగ, ఎం.సీతారం ప్రసాద్, ఎస్.పుస్పకుమారి గారలు పాల్గొన్నారు.
