సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ వద్ద నేడు, ఆదివారం బంగాళాఖాతం సముద్ర జలాల్లో మత్స్యకారుల వలకు భారీ సైజులో ఉన్న చేప చిక్కింది. దానిని అతికష్టం మీద 6గురు జాలర్లు కల్సి ఒడ్డుకు చేర్చడం స్థానికులు వింతగా చూడటం జరిగింది. కంబాల టేకుగా పిలిచే ఈ చేప సుమారు 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల మేర వెడల్పు ఉంది. చేప బరువు సుమారు 300 కేజీలుపైమాటే.. దీనిని అతి కష్టంపై బోటు నుంచి క్రేన్‌తో ఆటో పైకి ఎక్కించి, కాకినాడకు తరలించారు. పలువురు మత్స్యకారులు తాళ్ల సాయంతో కిందకు దింపి విక్రయించగా వెంకన్న అనే వ్యాపారి రూ.16,500కు కొనుగోలు చెయ్యడం విశేషం.
